Pavan Kalyan and Raviteja donations
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. వారిని ఆదుకునేందుకు ఎంతో మంది సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. సామాన్యులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణ, ఆస్థినష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి అండగా తామూ ఉన్నామంటూ టాలీవుడ్ సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు తమ వంతు సహాయాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు. తాజాగా హీరో, రాజకీయ నాయకుడు, జనసేనాని పవన్‌కల్యాణ్ కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు.
మాస్ మహారాజ్ రవితేజ కూడా స్పందించాడు. తన వంతుగా రూ.10 లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించాడు. `ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీఎం సహాయ నిధికి నేను రూ.10 లక్షల విరాళం ప్రకటిస్తున్నాను. ఇలాంటి సందర్భాల్లో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు వరద బాధితులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.