పాపం.. పవన్ ఆవేదన

Tollywood Actor, Janasena President Pavan Kalyan Is feeling bad. Do you know why?

134

పవన కళ్యాణ్ ఆవేదన చెందుతున్నారు. తనకు కరోనా వచ్చినందుకు కాదు.. తన అభిమానులు బాధపడుతున్నందుకు కాదు.. తమ పార్టీ తిరుపతిలో గెలుస్తుందా? లేదా? అనేదీ అంతకంటే కాదు. మరి, ఇంతకీ ఆయన ఏ విషయంలో ఆవేదన పడుతున్నారో తెలుసా? ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్స్ కొరత ఏర్పడినందుకు. ఇలాంటి పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరం అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇదే సమయంలో ఆయన ప్రజలకో విఙ్ఞప్తి చేస్తున్నారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని.. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో తన ఆరోగ్యం కుదుటపడుతోందని వెల్లడించారు. కొవిడ్ వచ్చినా తమ సారుకు ప్రజల పట్ల ఎంత ప్రేమో చూడండి.. అంటూ జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రల్లో బెడ్లు లేవు అని బాధపడటం కంటే.. సోనూ సూద్ తరహాలో మీరు కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయవచ్చు కదా అని ఆయన్ని పిచ్చిగా అభిమానించేవారంతా కోరుతున్నారు. కరోనా సమయంలో జనసైన్యమంతా ముందుకొచ్చి ప్రజలకు సాయం చేయండంటూ విన్నవిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here