ఉత్తరాంధ్ర పై పవన్ ఫోకస్

Pavan Kalyan Focus on North Andra … ఎందుకంటే

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల పై ఫుల్ గా ఫోకస్ పెట్టనున్న జనసేనాని ఎన్నికల వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు.గిరిజ‌న స‌మ‌స్యల‌పై గ‌ళ‌మెత్తేందుకు జనసేనాని ప‌వ‌న్ కల్యాణ్‌ సిద్దమ‌య్యారు. ఇందుకోసం ఈ మ‌ద్యాహ్నం విశా‌ఖ జిల్లా పాడేరులో భారీ బ‌హిరంభ స‌భ‌ను నిర్వహిస్తున్నారు. స్థానిక అంబెద్కర్ సెంట‌ర్ లో సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ స‌భ ద్వారా గిరిజ‌నుల స‌మ‌స్యల‌పై మాట్లాడ‌డంతో పాటు గిరిజ‌నుల సాధికారిత కోసం ఏం చేయబోతున్నారో పవన్‌ ప్రకటిస్తారు.
పవన్‌ మరోసారి ఉత్తరాంధ్ర పర్యటనకు సిద్ధమయ్యారు. మూడు రోజుల పాటు విశాఖ లో ఉండి ఉత్తరాంధ్ర జిల్లాల నేత‌ల‌తో స‌మావేశ‌ం కానున్నారు. పార్టీ బ‌లోపేతంతో పాటు స్థానిక స‌మ‌స్యల‌పైనా ప‌వ‌న్ నేత‌ల‌తో చ‌ర్చించ‌నున్నారు. క్షేత్ర స్తాయిలో నేత‌లు, కార్యక‌ర్తల‌తో స‌మావేశాలు నిర్వహిస్తారు. పార్టీ నిర్మాణం, బ‌లోపేతం అజెండాగానే ఈ టూర్ జ‌ర‌గ‌నుంది. ఈ ఉదయం శ్రీకాకుళం జిల్లా నేత‌ల‌తో స‌మావేశం కానున్న పవన్‌ మ‌ద్యాహ్నం పాడేరులోని బ‌హిరంగ స‌భకు హాజరవుతారు. గిరిజ‌నుల సంక్షేమం, అభివృద్ది అంశాల‌పై ప‌వ‌న్ మాట్లాడే అవకాశం ఉంది. అంతేకాకుండా జ‌న‌సేన అధికారంలోకి వ‌స్తే గిరిజ‌నుల సాధికార‌త కోసం ఏం చేస్తుందనే విష‌యాన్ని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రేపు విజయనగరం జిల్లా నాయకులతో ప‌వ‌న్ సమావేశమవుతారు. 25 వ తేదిన‌ విశాఖపట్నం నాయకులతో చర్చలు జరుపుతారు. మూడు రోజుల‌పాటు ఉత్తరాంద్రాలో బిజీగా గ‌డ‌ప‌నున్నారు పవన్ కల్యాణ్‌. మొత్తానికి పార్టీ శ్రేణులతో మాట్లాడి అభ్యర్థుల విషయంలో నిర్ణయం తీసుకోవడంతో పాటుగా పైన గిరిజనులకు అండగా తమ పార్టీ పని చేస్తుందని చెప్పి ఎన్నికల్లో జనసేన ఆశీర్వదించాలని పవన్ కళ్యాణ్ కోరనున్నారు.

Check Out For More Discounts In AMAZON
For More Interesting News visit TSNEWS.TV
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article