పవన్ కూడా ఆ విషయంలో కేసీఆర్ బాట పట్టారు

Pavan Kalyan Following KCR

సామాన్యుల కంటే రాజకీయ ప్రముఖులకు సెంటిమెంట్స్ కాస్త ఎక్కువే ఉంటాయి అనే సంగతి అందరికి తెలిసిందే. కానీ ఇంత ఎక్కువగా ఉంటాయా అన్నది మాత్రం పవన్ కళ్యాణ్ ను చూస్తేనే అర్ధం అవుతుంది. ఇక పవన్ ను చోసిన వారంతా కేసీఆర్ బాట పట్టారా ఏంటి అని తెగ సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయం పవన్ కళ్యాణ్ మెడలో ఒక తాయత్తు స్పెషల్ ఎట్రాక్షన్ గా దర్శనం ఇవ్వటమే అందుకు కారణం . ఇంతకీ ఆయన రాజకీయాల్లో రాణించాలని ఆ తాయత్తు కట్టుకున్నారా ? లేకా మరేమైనా రీజన్ ఉందా అని అందరూ ఆలోచనలో పడ్డారు .
ఇక రాజకీయ నాయకులు బాగా సెంటిమెంట్ లకు ప్రాధాన్యతనిస్తారు. ఎన్నికల్లో విజయ౦ సాధించడానికి గాను వాళ్ళు సెంటిమెంట్ ని ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటారు. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ వరుసలో కాస్త ముందు ఉంటారు. ఆయన చేతికి తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కట్టిన దట్టి కనపడుతూ ఉంటుంది. ఆయన ఏ ఎన్నికల ప్రచారానికి వెళ్ళినా లేక ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్ళినా ఎక్కువగా దాంతో దర్శనం ఇస్తూ ఉంటారు . ప్రతి ముఖ్యమైన పని ప్రారంభించే ముందు సంఖ్యాబలం మరియు మంచి ఘడియలు చూస్తారు అనే విషయం కూడా దాదాపు అందరికీ తెలిసిపోయింది.అంతెందుకు, వాస్తు బాగాలేదని సచివాలయానికి కూడా రాకుండానే పాలన సాగించిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు కేసీఆర్ . ఇక ఆయన జాతకాల పిచ్చి సెంటిమెంట్ ల గురించి ప్రధాని మోడీ కామెంట్స్ చేశారు అంటే ఆయన ఎంతగా సెంటిమెంట్ లను నమ్ముతారో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణా ఎన్నికల్లో తెరాస విజయం సాధించడంతో కాస్త సెంటిమెంట్ భావాలు ఎక్కువగా ఉండే కెసిఆర్ దానిని ఎక్కువగా ధరిస్తున్నారు. ఇక దానిని తెరాస నాయకులు కూడా ఆనవాయితీగా తీసుకోవడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ఎన్నికల ప్రచారం సమయంలో వాళ్ళు దానిని ధరించే ప్రచారానికి వెళ్ళే వారు అనే సంగతి అందరికి తెలిసి౦దే. తెరాస కు పట్టున్న ప్రధాన జిల్లాల్లో ఈ సెంటిమెంట్ ని ఎక్కువగా అక్కడి నేతలో ఫాలో అయ్యారు. దీనితో తెరాస లో దట్టి హాట్ టాపిక్ గా మారిపోయింది అనే చెప్పాలి .
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కెసిఆర్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అనుసరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల శ్రీకాకుళంలోని కార్యకర్తలు, పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో పవన్‌ మెడలో ఓ తాయత్తు మీడియా కంట పడింది. ఆయన ఇటీవల విదేశాలకు వెళ్ళిన సమయంలో కూడా ఆ తాయత్తు ఆయన మెడలో ఉంది. అయితే అది అప్పుడు ఎవరూ పట్టించుకోకపోయినా ఇప్పుడు అది బయటకు రావడంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధారణ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాయత్తుతో దర్శనం ఇవ్వడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది. దీంతో పవన్ కూడా కేసీఆర్ ని ఫాలో అవుతున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. రానున్న ఎన్నికల నేపధ్యంలో పవన్ మేడలో ప్రత్యేకంగా కనిపిస్తున్న తాయత్తు ఏం మాయలు చేస్తుందో.. పవన్ ను ఎన్నికల్లో ఏ స్థానంలో నిలబెడుతుందో వేచి చూడాలి

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article