జగన్, కేసీఆర్ స్నేహంపై పవన్ సంచలన వ్యాఖ్యలు

Spread the love

Pavan Kayan sensational Comments KCR and JAGAN

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు ఏ పార్టీని ఎవరు ఎందుకు తిడతారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి దాకా వైయస్ జగన్, పవన్ కళ్యాణ్ కలిసి పొత్తులతో పోటీ చేస్తారని పుకార్లు షికార్లు చేశాయి. ఆ తర్వాత టిడిపితో కలిసి జనసేన నడుస్తుందని కొంతకాలం ప్రచారం సాగింది. కానీ జనసేన అని మాత్రం తాను వామపక్ష పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లుగా తేల్చి చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. ఇక ఏపీలో టీఆర్ఎస్ నిర్వహించబోయే పాత్రపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కక్షసాధింపు కోసమే వైసిపి అధినేత జగన్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తోందని ఆయన అన్నారు. 

ప్రతిపక్ష నేత జగన్‌ను తెలంగాణ గడ్డపై అడుగు పెట్టనీయబోమని అప్పట్లో తెరాస వాళ్లే అడ్డుకున్నారని పవన్ గుర్తుచేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉండేవారని ఆయన అన్నారు. అలాంటిది ఇప్పుడు టీఆర్‌ఎస్‌తో జగన్ కలసి నడుస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో వీళ్లని చూస్తే అర్ధమవుతుందని ఆయన అన్నారు.
దోపిడీ వ్యవస్థపై పోరాడాలంటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కావాలని ఆయన అన్నారు. స్వరాష్ట్రం కోసం తెలంగాణ యువత ఎలా రోడ్లపైకి వచ్చారో.. అలా రావాలన్నారు. నందివెలుగు అడ్డరోడ్డు నుంచి భారీ ర్యాలీ నిర్వహించి, పెదరావూరు బహిరంగ సభలో ప్రసంగించారు.
దోపిడీ వ్యవస్థపై పోరాటానికి జాగోరే జాగో కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ప్రతి పనికీ నేతలపైనే ఆధారపడటం సరైంది కాదని, విదేశాల్లో ఇలాంటి వ్యవస్థ ఉండదని ఆయన అన్నారు. విదేశాలకు వెళ్లి ఉపాధి సృష్టిస్తున్న మనవాళ్లు ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారని అడిగారు. దానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకించిన కేసీఆర్ తో వైయస్ జగన్ కలిసి ఏపీలో రాజకీయాలు చేయడాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.

One thought on “జగన్, కేసీఆర్ స్నేహంపై పవన్ సంచలన వ్యాఖ్యలు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *