పవన్ కళ్యాణ్ కు కొవిడ్

జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ కు కరోనా సోకింది. గత కొద్దిరోజుల క్రితం ఆయన శిల్పాకళావేదికలో జరిగిన వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. కేవలం స్పీచ్ ఇచ్చేటప్పుడు తప్ప మిగతా ఏ సందర్భంలోనూ ఆయన మాస్కు తీయడం కనిపించలేదు. ఏదీఏమైనప్పటికీ, ఆయన త్వరగా కోలుకోవాలని జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.

183
PAVANKALYAN GOT CORONA
PAVANKALYAN GOT CORONA

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కొవిడ్ సోకింది. ప్రస్తుతం ఆయనకు నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో చికిత్స జరుగుతోంది. తను క్షేమంగా ఉన్నట్లు జనసేన పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 3న తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొని హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత నలతగా ఉండటంతో డాక్టర్ల సూచన మేరకు ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే, తొలుత ఫలితం నెగటివ్ గా వచ్చింది. అయినప్పటికీ, డాక్టర్ల సూచన మేరకు తన వ్యవసాయ క్షేత్రంలోనే క్వారంటైన్ కు వెళ్లారు. ఆ తర్వాత ఆయనకు కొద్దిపాటి జ్వరం, ఒళ్లు నొప్పులు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. దీంతో రెండు రోజుల కిందటమరోసారి కొవిడ్ పరీక్షలు జరుపగా పాజిటివ్ గా ఫలితం వచ్చింది. ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు, కార్డియాలిస్టు డాక్టర్ తంగెళ్ల సుమన్ హైదరాబాద్ కు విచ్చేసి పవన్ కళ్యాణ్ కి చికిత్స ఆరంభించారు. అవసరమైన ఇతర పరీక్షలన్నీ చేయించారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటివైరల్ మందులతో చికిత్స చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా ఇస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here