సంక్రాంతికి పవన్ కళ్యాణ్ ఒక్కడేనా ..?

17
pawan alone in sankranthi 
pawan alone in sankranthi 

pawan alone in sankranthi

సంక్రాంతి.. తెలుగువారికి అత్యంత ఇష్టమైన పండగ. తెలుగు సినిమా పరిశ్రమకు అత్యంత అవసరమైన సీజన్. ఈ టైమ్ లో వచ్చే సినిమాలన్నిటికీ రిజల్ట్స్ తో పనిలేకుండా రెవిన్యూ వస్తుందనేది తెలుగు సినిమా మొదలైన దగ్గర్నుంచీ ఉన్న సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ కొన్నాళ్లుగా బ్రేక్ అవుతోన్నా.. సీజన్ కు ఉండే క్రేజ్ మాత్రం తగ్గలేదు. అందుకే ఐదారు నెలల ముందుగానే సంక్రాంతి సినిమాలు డేట్ ఫిక్స్ చేసుకుంటాయి. అయితే కరోనా కారణంగా ఆలస్యమైన సినిమాలు కూడా వచ్చే సంక్రాంతినే టార్గెట్ చేసుకున్నాయి. మరి ఆ సినిమాలేంటీ.. సంక్రాంతికే వస్తాయా లేక ఓటిటికీ వెళతాయా అనేది చూద్దాం..

వచ్చే సంక్రాంతికి ఖచ్చితంగా వచ్చే సినిమాగా వకీల్ సాబ్ పేరు వినిపిస్తోంది. అజ్ఞాతవాసి తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన సినిమా ఇది. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్ ఈ నెల 23 నుంచి మళ్లీ మొదలు కాబోతోంది. ఈ షెడ్యూల్ లో పవన్ కూడా పాల్గొంటాడు. అలాగే హీరోయిన్ శ్రుతి హాసన్ సైతం ఈ షెడ్యూల్ లో షూటింగ్ లో జాయిన్ అవుతుంది. వకీల్ సాబ్ ను సంక్రాంతికే విడుదల చేయాలని.. తద్వారా ఆ సీజన్ లో వచ్చే పెద్ద సినిమాగా దీన్ని క్యాష్ చేసుకోవాలనేది నిర్మాతల ఆలోచనగా చెబుతున్నారు. సంక్రాంతికే వస్తే.. వకీల్ సాబ్ మాత్రం ఆ టైమ్ లో వచ్చే పెద్ద సినిమా అవుతుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన రెడ్ సైతం సంక్రాంతికే అంటున్నారు. వరుస ఫ్లాపుల తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చిన రామ్ ఈ సారి ఓ తమిళ్ సినిమా రీమేక్ తో రెడ్ అంటూ వస్తున్నాడు. నివేదా పేతురాజ్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీతో రామ్ ఫస్ట్ టైమ్ డ్యూయొల్ రోల్ చేస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయిన ఈ సినిమాను ఓటిటిలో కాక సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్ లో ఉంది టీమ్. మాస్ రాజా రవితేజ క్రాక్ సైతం సంక్రాంతినే టార్గెట్ చేస్తోంది.

రవితేజ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో సాగే కథ. గోపీచంద్ మలినేని దర్శకుడు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న క్రాక్ కు సంబంధించి ఇంకా కొంత షూటింగ్ బ్యాలన్స్ ఉంది. అది పూర్తయ్యాక ఓటిటిలో విడుదల చేస్తారు అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే రవితేజ అందుకు ఒప్పుకోకపోవచ్చు అని కూడా అంటున్నారు. సో క్రాక్ సంక్రాంతికి రావొచ్చట. ఒక్క హిట్ కోసం ఎన్నాళ్లుగానో చూస్తోన్న అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ను కూడా సంక్రాంతికే విడుదల చేస్తాం అని ఆ మధ్య ప్రకటించారు. రీసెంట్ గా షూటింగ్ కూడా పూర్తి చేశారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో బొమ్మరిల్లు భాస్కర్ చాలా రోజుల తర్వాత దర్శకుడుగా లక్ చెక్ చేసుకోబోతున్నాడు. సాధారణంగానే ఈ సినిమాపై ఇంకా బజ్ ప్రారంభం కాలేదు. అందుకే ఓటిటి నుంచి కూడా పెద్దగా ఆసక్తి కనిపించకపోవచ్చు. పైగా బడ్జెట్ కూడా పెద్దదే అంటున్నారు.

అందుకే సంక్రాంతికే రావొచ్చు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తోన్న లవ్ స్టోరీ సైతం సంక్రాంతికే వస్తుందనుకున్నారు. కానీ ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం. ఇప్పటి వరకూ అయిన పార్ట్ కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయిందంటున్నారు. అందువల్ల సంక్రాంతి కంటే ముందే డిసెంబర్ లోనే విడుదలైనా ఆశ్చర్యం లేదు. నాగచైన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మొదట్లో ఈ మూవీ కూడా ఓటిటిలో వస్తుందన్నారు. కానీ నిర్మాతల బ్యాక్ గ్రౌండ్ వల్ల థియేటర్స్ వరకూ ఖచ్చితంగా ఆగుతుందని చెప్పొచ్చు. మొత్తంగా ఇప్పటి వరకూ చెప్పుకున్న సినిమాల్లో చాలా వరకూ సంక్రాంతికంటే ముందే విడుదల కావొచ్చు. అందుకు ప్రధానంగా థియేటర్స్ ఓపెన్ అవడం ఇంపార్టెంట్. దసరా నుంచి థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. అయినా ఆడియన్స్ నుంచి ఇంతకు ముందులా రెస్పాన్స్ వస్తుందనుకోవడం లేదు పరిశ్రమ. ఒకవేళ జనం కూడా అంతే ఆసక్తిగా ఉంటే ఈ మూవీస్ కొంత ముందుగానే రావొచ్చు. లేదంటే సంక్రాంతి వరకూ ఆగొచ్చు. అలాగే వీటిలో ఒకటీ రెండు సినిమాలు ఓటిటిలోనే వచ్చినా ఆశ్చర్యం లేదు. బట్ ఇప్పటికైతే సంక్రాంతి సినిమాల లిస్ట్ ఇదే అనుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here