టికెట్ కోసం పవన్ దరఖాస్తు

PAWAN APPLIED FOR TICKET

  • టికెట్ల కేటాయింపులో స్క్రీనింగ్ కమిటీదే తుది నిర్ణయమన్న జనసేనాని
  • గాజువాక నుంచి బరిలోకి పవన్ కల్యాణ్?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీకి దిగేందుకు వీలుగా టికెట్ కేటాయించాలని కోరుతూ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు పార్టీ తొలి అభ్యర్థిగా స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్న జనసేన.. పార్టీ నుంచి బరిలోకి దిగే ఆశావహుల కోసం దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. ఈ దరఖాస్తులను పరిశీలించి, అభ్యర్థులను ఖరారు చేసేందుకు స్క్రీనింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. జనసేన టికెట్ల కేటాయింపులో ఈ కమిటీదే తుది నిర్ణయమని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. ఎవరైనా కమిటీకి దరఖాస్తు చేసుకోవాల్సిందేనన్నారు. ఇందులో భాగంగానే ఆయన పార్టీ తొలి అభ్యర్థిగా స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే చర్చ మొదలైంది. తొలుత రాయలసీమ నుంచి పోటీచేయాలని భావించిన ఆయన.. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రంగంలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఆయన ప్లాన్ మారినట్టు చెబుతున్నారు. గత కొంతకాలంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టిన ఆయన.. ఈ రెండు ప్రాంతాల నుంచే బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. గాజువాక నుంచి పోటీ చేయొచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article