ఈ నెలలోనే వస్తోన్న పవన్ కళ్యాణ్

24
pawan alone in sankranthi 
pawan alone in sankranthi 

pawan came soon

చిన్న సినిమాల షూటింగ్స్ మొదలయ్యాయి. ఆరేడు నెలలుగా స్తబ్ధుగా ఉన్న పరిశ్రమలో కాస్త సందడి మొదలైంది. ఇన్నాళ్లూ పనిలేకుండా ఉన్నవాళ్లందరూ కొంచెం ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే ఇలా చిన్న సినిమాలు ఎన్ని షూటింగ్స్ జరుపుకున్నా.. పరిశ్రమలో కనిపించని సందడి.. ఒక పెద్ద స్టార్ షూటింగ్ మొదలుపెడితేనే కనిపిస్తుంది. ఆ సందడి పెంచి, అందరికీ రూట్ క్లియర్ చేస్తూ ట్రెండ్ సెట్టర్ పవర్ స్టార్ రంగంలోకి దిగబోతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ నుంచి మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ ను సైతం షేక్ చేస్తున్నాడు. ఇప్పటికే ఐదు సినిమాలు లైన్ లో ఉన్నాయి. వీటిలో వకీల్ సాబ్ షూటింగ్ చివరిదశలో ఉంది. తర్వాత క్రిష్ డైరెక్షన్ లో, హరీశ్ శంకర్ తో రెండోసారి సినిమాలు అనౌన్స్ అయ్యాయి. అలాగే సురేందర్ రెడ్డి డైరెక్షన్ లోనూ సినిమా అఫీషియల్ గా ప్రకటన వచ్చింది. మరోవైపు మళయాల బ్లాక్ బస్టర్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లోనూ నటిస్తాడు అనే వార్తలు వస్తున్నాయి.

దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న వకీల్ సాబ్ కు వేణు శ్రీరామ్ డైరెక్టర్. కరోనా కారణంగా ఆగిపోయిన వకీల్ సాబ్ షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేసేందుకు రంగంలోకి దిగుతున్నాడు. యస్.. పెద్ద స్టార్స్ అంతా షూటింగ్స్ కు రావడానికి కాస్త వెనకా ముందూ ఆలోచిస్తుంటే పవర్ స్టార్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా వకీల్ సాబ్ షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. యస్ ఈ నెల 22నుంచి పవన్ కళ్యాణ్ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. ఒకే  షెడ్యూల్ లో షూటింగ్ మొత్తం పూర్తి చేసి ఈ యేడాది చివర్లో లేదా సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఈ విషయంలోనూ ముందుకు రావడంతో ఫ్యాన్స్ అంతా నిజంగానే గబ్బర్ సింగ్ అంటున్నారు.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here