రెండు స్థానాల నుంచి పవన్ పోటీ

105
PAWAN RECORD REMUNERATION
PAWAN RECORD REMUNERATION

PAWAN CONTEST IN TWO SEATS

  • గాజువాక, భీమవరం నుంచి బరిలో జనసేనాని
  • పార్టీ కార్యవర్గం నిర్ణయం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి ఆయన బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యవర్గం చర్చించి నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి పవన్ విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేస్తారనే ఊహానాలు సాగుతున్నాయి. ఇందుకు అనుగుణంగానే ఇప్పటివరకు ఆ స్థానాన్ని ప్రకటించలేదు. అయితే, ఆయన రెండో స్థానం నుంచి పోటీ చేయాలనే ఆలోచన ఇప్పటివరకు రాలేదు. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా పవన్ రెండు చోట్ల పోటీ అంశం తెరపైకి వచ్చింది. తాను రెండో చోట్ల పోటీ చేసే అంశాన్ని పార్టీ కార్యవర్గం చర్చిస్తోందని, మరో గంటలో ఇందుకు సంబంధించిన సమాచారం వస్తుందని మంగళవారం ఉదయం పవన్ కల్యాణ్ ట్విట్వర్ లో ప్రకటించారు. అనంతరం ఆయన గాజువాక, భీమవరం నుంచి పోటీ చేస్తారనే ప్రకటన వెలువడింది.

AP POLITICS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here