గాజువాకలో పవన్ నామినేషన్

PAWAN FILES NOMINATION

  • రేపు భీమవరంలో దాఖలు చేయనున్న జనసేన అధినేత

గాజువాక అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. విశాఖ నగరపాలక సంస్థ జోన్‌-5 కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామపత్రాలను సమర్పించారు. నామినేషన్‌ అనంతరం ఆయన గాజువాక, భీమునిపట్నం, విశాఖ సౌత్‌ నియోజకవర్గాల్లో జరగబోయే మూడు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన జనసేన అధినేత రెండు చోట్ల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం గాజువాక స్థానానిక నామినేషన్ వేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి కూడా పోటీకి దిగుతున్న ఆయన శుక్రవారం అక్కడ నామినేషన్ వేయనున్నారు.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article