లాయర్ సాబ్ గా పవన్ కళ్యాణ్

198
pawan movie with trivikram
pawan movie with trivikram

Pawan Kalyan as Lawyer Saab

జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే వెండితెరపై కనిపించనున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాతో పవన్ సినిమాలకు పుల్ స్టాప్ పెట్టిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన అజ్ఞాతవాసి చిత్రం ఇద్దరికి షాక్ ఇచ్చింది. త్రివిక్రమ్, పవన్ కెరీర్లో అజ్ఞాతవాసి భారీ డిజాస్టర్ గా నిలిచింది. అనంతరం పవన్ పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. అయితే పవన్ కళ్యాణ్ త్వరలోనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వివరాలలోకి వెళితే…

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. దిల్ రాజు, బోనీకపూర్ పింక్ సినిమాను తెలుగులో  అనువదించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు ఈ బడా నిర్మాతలు.ఇక ఈ సినిమాకు వేణుశ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వహించే అవకాశాలున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ సరసన నయనతార హీరోయిన్ గా చేయనున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు లాయర్ సాబ్ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు కృష్ణానగర్ సమాచారం. మరోవైపు ఈ సినిమాకు పవన్ కేవలం 40 రోజులపాటు డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఇక పవన్ ఎప్పుడెప్పుడు రీ ఎంట్రీ ఇస్తాడా అని ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇది నిజంగా శుభవార్తే. మరోవైపు పవన్‌ ఆర్ధిక అవసరాల కోసం సినిమాను చేసేందుకు ఒప్పుకున్నట్లు పవన్ సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది. మరి రీ ఎంట్రీలో పవన్ కళ్యాణ్ ఏ మేర అలరిస్తాడో చూడాలి.

Tollywood updates

ఇంటిల్లపాదిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుర్మార్గుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here