దేశం కోసం ఏం చెయ్యాలో చెప్పిన పవన్ కళ్యాణ్

83
Pawan Kalyan at 71st Republic Day
Pawan Kalyan at 71st Republic Day

Pawan Kalyan at 71st Republic Day Celebrations

రిపబ్లిక్ డే సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . జాతీయ జెండాకు కేవలం సెల్యూట్ చేసినంత మాత్రాన సరిపోదని, పూర్వీకుల త్యాగాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో భాగంగా, పవన్, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన, ప్రతి ఒక్కరూ త్యాగాలకు సిద్ధంగా ఉండాలని, భవిష్యత్ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. హిందూయిజం మతం కాదని, భారతీయతని గుర్తుంచుకోవాలని కోరారు. ఇండియా నుంచి మత ప్రాతిపదికనే పాకిస్థాన్ విడిపోయిందని, పాక్ ముస్లిం దేశంగా మిగిలిపోగా, ఇండియా మాత్రం సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. దేశ ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని, సమాజానికి మేలు చేసే పనులు చేయాలని పవన్ వ్యాఖ్యానించారు.

Pawan Kalyan at 71st Republic Day Celebrations,republic day , janasena cheif, pawan kalyan , mangalagiri, national flag ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here