అణచివెయ్యాలని చూస్తే అంతకంటే బలంగా పోరాడుతాం…

Pawan kalyan comments on Chinakakani tensions

రాజధాని రైతులకు మద్దతుగా పోరాటం సాగిస్తున్న పవన్ కళ్యాణ్ నేడు జాతీయ రహదారుల దిగ్బంధనం నేపధ్యంలో పోలీసుల తీరుపై, ప్రభుత్వ అవిఖరిపై నిప్పులు చెరిగారు. రాజధాని ప్రాంతంలో రైతులు ప్రజాస్వామ్య విధానంలో, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొడుతోందని జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు . చినకాకాని వద్ద పోలీసులు వ్యవహరించిన తీరును పవన్ తప్పుబట్టారు. ఈ మేరకు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇలాంటి చర్యలతో ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం భావిస్తే అది పొరబాటే అవుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని, అటు పరిపాలన రాజధాని విషయంలో విశాఖ వాసులు కూడా సంతృప్తిగా లేరని ఆరోపించారు. ఆందోళనలను అణచివేయాలని చూస్తే అంతకంటే బలంగా ఆందోళనలు చేపడతారని ప్రభుత్వం గ్రహించాలని హితవు పలికారు.రాజధాని అమరావతి కోసం రైతుల పక్షాన జనసేన పోరాటం సాగుతుందని చెప్పారు పవన్ కళ్యాణ్.

Pawan kalyan comments on Chinakakani tensions,pawan kalyan, three capitals, capital amaravati, janasena party, national highways blockade

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article