అమరసైనిక కుటుంబాలకు పవన్ కోటి విరాళం…

135
Pawan Kalyan donates Rs 1 crore for welfare of soldiers
Pawan Kalyan donates Rs 1 crore for welfare of soldiers

Pawan Kalyan donates Rs 1 crore for welfare of soldiers

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనటానికి ఢిల్లీకి వెళ్లిన పవన్ కేంద్రీయ సైనిక్ బోర్డ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి రూ. కోటి విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును  ఆర్మీ అధికారికి అందించారు. అనంతరం సైనిక కుటుంబ సభ్యులతో మాట్లాడారు.  కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించి.. సైనికాధికారులకు విరాళాన్ని అందజేసిన అనంతరం.. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో ఆయన కీలకపోన్యాసం చేయడంతోపాటు.. విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇవ్వనున్నారు . పవన్ గురించి రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రి స్మృతి ఇరాని, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా కూడా పాల్గొంటారు. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సందర్భంగా సైనికుల కుటుంబాల కోసం కోటి రూపాయలు విరాళంగా ఇస్తానని డిసెంబర్ 6, 2019న పవన్  ప్రకటించిన జనసేనాని  స్వయంగా తానే విరాళాన్ని అందిస్తానని మాటిచ్చారు. అన్నమాట ప్రకారం పవన్ నేడు  కేంద్రీయ సైనిక్ బోర్డ్ వారికి చెక్కును అందజేశారు.

Pawan Kalyan donates Rs 1 crore for welfare of soldiers,pawan kalyan , janasena party , delhi tour, indian students parliament

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here