సిఏఏకు మద్దతు తెలిపిన పవన్…

136
Pawan Kalyan extends
Pawan Kalyan extends

Pawan Kalyan extends support to CAA

దేశవ్యాప్తంగా  ఇప్పటికీ నిరసనలు కొనసాగుతున్న, పలు రాష్ట్రాలు అమలు చెయ్యం అని తేల్చి చెప్తున్న  పౌరసత్వ సవరణ చట్టంపైనా జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. సీఏఏపై నెలకొన్న అనుమానాలను, భయాలను తొలగించే ప్రయత్నం చేశారు. సీఏఏకు పవన్ తన మద్దతు తెలిపారు. దేశం నుంచి విడిపోయినప్పుడు పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకుందని.. కానీ మన దేశం మాత్రం హిందూ దేశంగా ప్రకటించుకోలేదని పవన్ గుర్తు చేశారు. పాకిస్తాన్ లో మైనార్టీలు తగ్గిపోయారని, హిందువులపై దాడులు జరుగుతున్నాయని పవన్ వాపోయారు. పాకిస్తాన్ మైనార్టీ క్రికెటరే ఇబ్బంది ఎదుర్కొంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు.సీఏఏపై ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని, ముస్లింల పౌరసత్వం తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పవన్ ఆరోపించారు. భారతీయ పౌరులకు సీఏఏతో ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. సిఏఏ వల్ల మైనార్టీలను రక్షించే అవకాశం కలుగుతుందని  తేల్చి చెప్పారు. అన్ని మతాలను సమానంగా గౌరవించే దేశం మనది అని పవన్ చెప్పారు. గాంధీ, నెహ్రూ ఆలోచనలనే ప్రధాని మోడీ అమలు చేస్తున్నారని వివరించారు. సీఏఏతో ముస్లింలకు పౌరసత్వం తీసేస్తారని అసత్య ప్రచారం చేస్తున్నారని పవన్ అన్నారు. ఏది ఏమైనా సీఏఏ లను పలు రాష్ట్రాలు బాహాటంగా వ్యతిరేకిస్తున్న నేపధ్యంలో నిన్నటి వరకు ఈ విషయంపై సైలెంట్ గా వున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన మద్దతు తెలపటం గమనార్హం .

Jana Sena PartyPawan Kalyan extends support to CAA,andhra pradesh ,  janasena, pawan kalyan , support , CAA,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here