జనసేనను పవన్ ఓఎల్ఎక్స్ లో పెట్టారా?

Pawan Kalyan Janasena In OLX

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఓఎల్ఎక్స్ లో రాజకీయ పార్టీని కూడా పెట్టొచ్చని నిన్ననే మాకు అర్థమయింది. పవన్ ను ఓఎల్ ఎక్స్ తత్వవేత్తగా అభివర్ణించారు. పవన్ పొత్తులకు వెళ్లి పార్టీ సిద్ధాంతాలను మరిచారన్నారు. జనసేనను ఓఎల్ఎక్స్ లో పెట్టుకోవచ్చన్నారు.రాజకీయ ఆర్థిక ప్రయోజనాలే ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుకు పోతున్నారని మంత్రి ధ్వజమెత్తారు. అవకాశ వాద రాజకీయాలకు కొత్త చిరునామాగా పవన్ కల్యాణ్ మారారన్నారు. బాబుకు లోకేశ్ పై నమ్మకం లేదు అందుకే పవన్ ను దగ్గర తీస్తున్నారన్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కండిషన్ పెట్టి పవన్ బీజేపీలో చేరొచ్చు కదా అన్నారు. పవన్ బేషరతుగా ఎందుకు లొంగిపోయాడన్నారు పేర్ని నాని. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలన్ని పవన్ దత్తత తీసుకున్నారన్నారు. పవన్ చెప్పేదొకటి చేసేదొకటన్నారు. పవన్ మాట్లాడేదానికి విలువ లేదన్నారు పేర్ని నాని.జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైద్ధాంతిక విలువుల మరిచాడని మంత్రి పేర్ని నాని విమర్శించారు.  చంద్రబాబు అవకాశవాద రాజకీయాన్ని పవన్ దత్తత తీసుకున్నారన్నారని నాని విమర్శించారు.
జగన్ పై సోనియాగాంధీ, చంద్రబాబు నాయుడు కలిసి కేసులు పెట్టించారని అన్నారు. పవన్ పై కూడా ఏమైనా కనిపించని కేసులైమైనా ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లి భేషరుతుగా కలిసి పనిచేస్తామని బీజేపీ నేతలకు చెప్పారన్నారు. అదే చొరవతో ఆ నేతలతో చెప్పి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముందుగా ప్రకటింపచేయాలని పవన్ కు సవాల్ విసిరారు.

Pawan Kalyan Janasena In OLXJanasena In OLX,janasena party, ycp minister, perni nani, pawan kalyan , olx  app, party for sale , bjp alliance,OLX,Janasena Will Buy As OLX

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article