పవన్ కేసీఆర్ లు ఏం మాట్లాడుకున్నారు

Pawan Kalyan and KCR meet

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌‌లో ఇచ్చిన ఎట్‌హోమ్ తేనీటి విందులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను వేడెక్కించే దృశ్యం కనిపించింది. అదే సీఎం కేసీఆర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ల భేటీ. ఎట్‌హామ్ కార్యక్రమంలో కేసీఆర్, పవన్ కళ్యాణ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. కేసీఆర్, పవన్ పక్కపక్కనే కూర్చుని చాలాసేపు ముచ్చటించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్, పవన్ కళ్యాణ్ మధ్య చర్చల్లో కేసీఆర్ ఎక్కువసేపు మాట్లాడటం… వాటిని పవన్ ఆసక్తిగా వినడం కనిపించింది. వారిద్దరు ఏం మాట్లాడుకుని ఉంటారు, ఏయే అంశాలు చర్చకు వచ్చి ఉంటాయి అనేది పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ దృశ్యంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఏపీ రాజకీయాల్లో వైసీపీ వైపు టీఆర్ఎస్ ఉందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. జనసేనతో పొత్తు కోసం వైసీపీ ప్రయత్నిస్తోందని… ఇందుకు కొందరు టీఆర్ఎస్ నేతలు తనతో మాట్లాడారని ఆ మధ్య పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ అన్నారు. దీనికి తోడు కేటీఆర్-జగన్ భేటీపై పవన్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ పరిణామాల తర్వాత కేసీఆర్‌తో పవన్ మంతనాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.వీరి మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీలోని రాజకీయ పరిణామాలపైనే ఇరువురు సీరియస్‌గా చర్చలు జరిపి ఉంటారనే వాదనా ఉంది. కేసీఆర్‌తో జరిపిన చర్చల్లో కేటీఆర్-జగన్ భేటీ అంశాన్ని పవన్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల్లో జనసేనను మళ్లీ తమతో కలుపుకుని ముందుకు వెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్, పవన్ సమాలోచనలు జరపడం టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నింపింది. ఎట్‌హోం కార్యక్రమంలో కేసీఆర్ కన్నా ముందు పవన్ కళ్యాణ్- టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ చాలా సేపు మాట్లాడుకున్నారు. వారు ఇంతకీ ఏ అంశాలపై మాట్లాడుకున్నారు అనేది ఏపీ లో హాట్ టాపిక్.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article