పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్

286
pawan movie with trivikram
pawan movie with trivikram

pawan movie with trivikram

త్రివిక్రమ్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ తో సినిమాకు సిద్ధమయ్యాడు. మామూలుగా అతను ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఎన్టీఆర్ ఇప్పుడు రాజమౌళి వద్ద ‘లాక్’అయి ఉన్నాడు. ఆ లాక్ ఎప్పటికి తొలగుతుందో చెప్పలేని పరిస్థితి. అతను రాజమౌళి సినిమా పూర్తి చేసేంత వరకూ త్రివిక్రమ్ ఖాళీగానే ఉండాలి. అందుకే అప్పటి వరకూ ఖాళీగా ఉండటం కంటే ఎన్నాళ్లుగానో అనుకుంటోన్న పవన్ కళ్యాణ్ సినిమా ఫినిష్ చేయాలనుకుంటున్నారట. అయితే త్రివిక్రమ్ వద్ద కథ కూడా సిద్ధంగా ఉంది. అందుకే పవన్ కూడా ఈయనతో మూవీ అంటే వెంటనే ఇప్పుడు చేస్తోన్న ప్రాజెక్ట్స్ ఆపేందుకు సిద్ధంగా ఉన్నాడు. పవన్ చేసిన వకీల్ సాబ్ ఇంకా కొంత షూటింగ్ బ్యాలన్స్ ఉంది. దీనిపై ఎవరికీ పెద్దగా ఆసక్తి లేదు. తర్వాత క్రిష్ తో మూవీ రూపొందుతోంది. కానీ ఈ మూవీకి అస్సలు బజ్ రావడం లేదు. అందుకే పవన్ ఫ్యాన్స్ కూడా ఆ రెండు సినిమాలూ వదిలేసి హరీష్ శంకర్ సినిమాపై హోప్స్ పెట్టుకున్నారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు త్రివిక్రమ్ పేరు తెరపైకి వచ్చింది.

దీంతో ఈ రెండు సినిమాలకు గ్యాప్ ఇచ్చేసి అటు హరీష్ సినిమాను కూడా ఆపేసి ముందుగా త్రివిక్రమ్ సినిమా ఫినిష్ చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే ఈ ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళుతుంది. త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ లాంటి హారికహాసిని సంస్థే ఈ చిత్రాన్నీ నిర్మించబోతోంది. ఇక ఇటు ఎన్టీఆర్ ను కాదని త్రివిక్రమ్ గతంలోనే వెంకటేష్ తో సినిమా చేస్తాడు అనే మాటలు వినిపించాయి. కానీ ఇప్పుడు వెంకటేష్ కంటే పవన్ కళ్యాణ్ బెస్ట్ ఆప్షన్ కదా. పైగా ఈ ఇద్దరి కాంబోలో గతంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ అయింది. అంతకు మించిని విమర్శలు కూడా వచ్చాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పేందుకు ఇదో మంచి ఛాన్స్ అవుతుంది. మొత్తంగా పవన్ తో త్రివిక్రమ్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా దాదాపు కన్ఫార్మ్ అయింది. ఈ వారంలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ న్యూస్ రాబోతోంది.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here