సమర్థులు లేకే ఓటమి: పవన్

PAWAN ON ELECTION DEFEAT

పార్టీలో సమర్థులైన నాయకులు లేకపోవడం వల్లే ఎన్నికట్లో ఓడిపోయామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఏ తప్పులు చేశామో గుర్తించాలని వారికి సూచించారు. కష్టసాధ్యమైన హామీలు ఇచ్చి ఉంటే తమ పార్టీ కూడా గెలిచి ఉండేదన్నారు. పింఛన్లను ఏటా రూ.250 పెంచుతామని జగన్ ముందే చెప్పి ఉండాల్సిందని పేర్కొన్నారు. అమలు చేయలేని హామీలు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. జగన్‌ మద్యపాన నిషేధం అమలు చేయలేరని.. మహిళలు పైగా సంపూర్ణ మద్యపాన నిషేధం వల్ల అనర్థాలు వస్తాయని వ్యాఖ్యానించారు. తనకు ఎలాంటి స్వార్థం లేదని.. అదే ఉంటే 10 మందితో వెళ్లి ఏదైనా పార్టీలో కలిసేవాణ్ని అని వ్యాఖ్యానించారు. 2014లో కొంత మంది పార్టీని విలీనం చేయాలని కోరారని.. దానికి తాము ఒప్పుకోలేదని పవన్‌ చెప్పారు. తమ దగ్గర డబ్బు లేదని.. కేవలం ఆశయ బలంతో వచ్చిన పార్టీ జనసేన అని వ్యాఖ్యానించారు. ఏదో ఒకరోజు దేశం మొత్తం మనవైపు చూసేలా చేస్తానని పేర్కొన్నారు. ఎన్నికల్లో తాను ఓడిపోవడం మంచిదైందని.. దీని వల్లే ఎవరు తన వాళ్లో అర్థమైందని పవన్‌ వ్యాఖ్యానించారు.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article