ఇదేం న్యాయం ‘వకీల్ సాబ్…

Pawan Vakeel Sab First Look Review

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’. కొన్నాళ్లుగా లాయర్ సాబ్ అనే టైటిల్ వినిపిస్తోన్నా ఫైనల్ గా టీమ్ ఈ టైటిల్ కే మొగ్గు చూపింది. ఇక చెప్పినట్టుగానే మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ అలా వాలుగా పడుకుని విరిగిన చైర్ పై కాళ్లు పెట్టి ఏదే పుస్తకం చదువుతున్నట్టుగా ఉన్న ఈ స్టిల్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోన్నా.. అందులో కొత్తదనం మాత్రం కనిపించడం లేదు. ఇంకా చెబితే సినిమా థీమ్ ను వీళ్లు చాలా వరకూ మార్చేసినట్టుగానూ అనుకోవచ్చు.

మామూలుగా బాలీవుడ్ లో హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్ గా వస్తోన్న ఈ చిత్రంలో వకీల్ సాబ్ కంటే ఎక్కువగా ఇతర కీలక పాత్రల్లో నటించిన అమ్మాయిలదే కీ రోల్. ఒరిజినల్ లో లాయర్ పాత్ర పరిమితం. కానీ ప్రభావవంతం. అమితాబ్ ఆ పాత్రకు తన స్టార్డమ్ తో వన్నె తెచ్చాడు. అందుకే ఆ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో అమ్మాయిల పోటో కూడా ఉంటుంది. ఆ పైనే మెగాస్టార్ ఉంటాడు.

అలాగే తమిళ్ లో అజిత్ చేసినప్పుడు కూడా అమ్మాయిలతో కలిపి ఉన్న లుక్ నే విడుదల చేశారు. అదే టైమ్ లో అజిత్ మేకోవర్ లో కూడా పెద్దగా మార్పులు లేవు. బట్ ఆ ఇద్దరికీ భిన్నంగా కేవలం హీరోయిజం ఎలివేట్ చేస్తున్నారా అనిపించేలా పవన్ లుక్ ను విడుదల చేశారు. కనీసంగా కూడా ఆ అమ్మాయిల ఫోటో లేదు. అలాగే హీరో లుక్ కూడా కాస్త మాస్ గా ఉంది. దీన్ని బట్టి.. సినిమా అంతా ఈ సారి పవన్ కళ్యాణ్ చుట్టే తిరుగుతుంది అని ఊహించొచ్చు. ఏదేమైనా సమానత్వం గురించి రాజకీయాల్లో చెప్పినంత సులువు కాదు.. సినిమాల్లోనూ పాటించడం. అంతేనా పవన్ కళ్యాణ్ గారూ..

Pawan Vakeel Sab First Look Review,#PSPK26 Movie Teaser,#PSPK26,Vakeel Sab Motion Poster,Tollywood Latest Updates,PSPK26 Vakil Saab FirstLook,Pawan Latest Movie Updates

 

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article