రెచ్చగొడితే ఎంతకైనా పోరాడతా ..  వైసీపీకి పవన్ హెచ్చరిక 

Pawan warns the YCP

రాజోలు ఎమ్మెల్యే  రాపాక వరప్రసాద్ విషయంలో  అధికార పార్టీ తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు.  జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తే  సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు.  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లాగా కూడా డబ్బులు ఇస్తే గెలిచే వాళ్లమని,  తాము  ప్రలోభాలకు గురి చేయలేదు కాబట్టే  ఇలా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.  సహనాన్ని పరీక్షించవద్దు అని హెచ్చరించారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. డబ్బు పంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. డబ్బు పంచి ఉంటే జనసేన కూడా మంచి స్థానాలే గెలిచేదని చెప్పుకొచ్చారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడిన పవన్ జనసేన పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యేను తమ పార్టీలోకి లాక్కునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని పవన్ ఆరోపించారు. అందువల్లే రాపాక వరప్రసాదరావుపై అనేక కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. తనను రెచ్చగొట్ట వద్దని పవన్ హెచ్చరించారు. రెచ్చగొడితే ఎంతవరకు అయినా పోరాడతానని పవన్ అధికార పార్టీకి హెచ్చరించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article