జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన జనసేనాని

136
pawan welcome cm jagan decision to refer sugali preethi case to cbi
pawan welcome cm jagan decision to refer sugali preethi case to cbi

pawan welcome cm jagan decision to refer sugali preethi case to cbi

తాజాగా  సుగాలి ప్రీతీ కేసులో సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్  హర్షం వ్యక్తం చేశారు . సుగాలీ ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదని  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు . సుగాలి ప్రీతీ విషయంలో పోరాటం సాగిస్తామని చెప్పిన పవన్ ఇటీవల కర్నూలు వెళ్లి సుగాలి ప్రీతీ తల్లిదండ్రులతో మాట్లాడారు. సీఎం జగన్ ను ప్రీతీ కేసు సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేశారు . ఇక ఈ నేపధ్యంలో తాజాగా తీసుకున్న నిర్ణయంపై  జనసేన ప్రకటన విడుదల చేసింది.

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సుగాలీ ప్రీతి కుటుంబానికి ఒకింత ఊరట కలిగిస్తుందని ,బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయడంలో ఇప్పటికే ఆలస్యమైందని సీబీఐ విచారణ ద్వారా ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు పవన్ కళ్యాణ్. పాఠశాలకు వెళ్ళిన చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టి ఉసురు తీసినవాళ్లని కఠినంగా శిక్షించాలని  డిమాండ్ చేశారు .కర్నూలు నగరం నడిబొడ్డున లక్షల మంది ప్రజలు ఇదే విషయాన్ని నినదించారని గుర్తు చేసిన పవన్ తమ ప్రకటన ద్వారా తెలియజేశారు .ప్రభుత్వంలో కదలిక వచ్చేలా సుగాలి ప్రీతి కుటుంబం వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికీ పవన్ కృతజ్ఞతలు తెలిపారు . జనసేన నాయకులకీ, జన సైనికులకీ, ప్రజా సంఘాలకీ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. మొత్తానికి జనసేన అధినేత పవన్ సుగాలి ప్రీతీ విషయంలో పోరాటం చేసి సక్సెస్ అయ్యారని జనసేన నాయకులు అంటున్నారు. ఇక అన్ని విషయాల్లో సీఎం జగన్ ను వ్యతిరేకిస్తున్న పవన్ ఈ విషయంలో మాత్రం జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు

pawan welcome cm jagan decision to refer sugali preethi case to cbi,cm jagan, cbi , sugaali preethi case, pawan kalyan , fight for preethi , janasena party

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here