సీఎం కేసీఆర్ తో మాట్లాడుతా అంటున్న జనసేనాని

PAWAN WILL MET KCR

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ మాత్రం ఆర్టీసీ కార్మికులతో చర్చలు అంశాన్ని పక్కనపెట్టి ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ఆర్టీసీ కార్మికులు నిన్న నిర్వహించిన సకల జనభేరి సభ సక్సెస్ అయింది. అయినప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పై తనకు గట్టి నమ్మకం ఉందని, కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. సమ్మె విషయమై సీఎం కేసీఆర్ తో మాట్లాడతానని, అప్పటికీ కేసీఆర్ పట్టించుకోకపోతే ఆర్టీసీ కార్మికులు భవిష్యత్ లో నిర్వహించే కార్యక్రమాలకు తాను పూర్తిగా మద్దతు ఇస్తానని వెల్లడించారు. 27 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండడం బాధాకరమైన విషయం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అశ్వత్థామరెడ్డి నేతృత్వంలో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఈ మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ ను బంజారాహిల్స్ లోని జనసేన కార్యాలయంలో కలిశారు. సమ్మెకు మద్దతుగా నిలవాలని కోరగా, పవన్ సానుకూలంగా స్పందించినట్లు గా తెలుస్తుంది.

TS POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article