Payal Rajput on “Venky Mama”
`ఎఫ్ 2` సక్సెస్ తర్వాత విక్టరీ వెంకటేష్ చేయబోతున్న చిత్రం `వెంకీమామ`. బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. ఇందులో ముందుగా ఇద్దరు హీరోయిన్స్ అనుకున్నారు. అందులో వెంకీ సరసన శ్రియా శరన్.. నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్‌ను ఫిక్స్ అయ్యారు. అయితే కారణాలు తెలియలేదు కానీ.. ఇప్పుడు శ్రియా శరన్‌ను కాదని.. ఆ స్థానంలో `ఆర్.ఎక్స్ 100` ఫేమ్ పాయల్ రాజ్‌పుత్‌ను తీసుకున్నారని సమాచారం. ఫిబ్రవరి 22నుండి షూటింగ్ జరగబోయే ఈ సినిమా రాజమండ్రి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుంది. కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించనుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దసరా సందర్భంగా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
For More Click Here