ఐఫోన్, ఐప్యాడ్లు అమ్ముతున్న పేటిఎం మాల్

PAYTM SELLS I PHONE

పేటిఎం మాల్, భారతదేశంలో మొబైల్ ఫోన్స్ విక్రయంలో అతి పెద్ద విక్రయదారులు మరియు ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఇష్టమైన ఎంపికగా ఉంది. డీల్ ప్రకారంగా, ఆపిల్ ఉత్పత్తులను ఈ వేదికపై విక్రయించడానికి, కేవలం అధీకృత విక్రయదారులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఎవరైనా స్వతంత్ర విక్రయదారుడు, తన ఉత్పత్తులను పేటిఎం మాల్ పై లిస్ట్ చేయాలనుకునేందుకు ముందుగా ఆపిల్ నుండి అధీకృతం తెచ్చుకోవాల్సి ఉంది. దీనితో, వినియోగదారులు, అసలైన ఉత్పత్తిని న్యాయమైన ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇంకా, ఆపిల్ కూడా తన వెబ్ సైట్ లో పేటిఎం మాల్ ను భారతదేశంలో ఆపిల్ ఉత్పాదనల కోసం ఒక అధీకృత రీసెల్లర్ గా, ప్రమోట్ చేస్తుంది.  

శ్రీనివాస్ మోథె, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, పేటిఎం మాల్, ఇలా అన్నారు, “భారతదేశంలో ఐఫోన్, ఐప్యాడ్ మరియు ఇతర ఆపిల్ ఉత్పాదనల ఇటీవలి ఎడిషన్స్ విక్రయించడం ప్రారంభించడానికి మేము ఆపిల్ తో ప్రత్యక్ష భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఎంతో ఉత్సాహంగా ఉంది. పేటిఎం మాల్, భారతదేశంలోని ప్రీమియం మొబైల్ ఫోన్స్ యొక్క అత్యంత ప్రముఖ విక్రయదారులలో ఒకటి మరియు ఇప్పుడు ఈ ఆపిల్ శ్రేణిని జోడించడం, మా వినియోగదారులకు ఆఫర్ చేయుటను మరింత శక్తివంతం చేస్తుంది. మా వినియోగదారులు, ఎంచుకోబడిన క్రెడిట్ కార్డ్స్ మరియు క్యాష్ బ్యాక్స్ వంటివాటిపై అదనపు డిస్కౌంట్ వంటి ఆఫర్స్ కు కూడా అర్హత పొందగలరు. ఇటీవలి ఆపిల్ ఉత్పాదనలన్నీ కూడా మా వేదికపై అందుబాటులో ఉంటాయి మరియు ఒక చెల్లుబాటయ్యే ప్రామాణిక ఆపిల్ వారెంటీతో లభిస్తాయి.”

APPLE PRODUCTS UPDATES

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article