కెనాల్‌లో కుళ్ళిన స్థితిలో ఎమ్మెల్యే చెల్లి కుటుంబం

Peddapalli MLA’s Kin Found Dead In In Kakatiya Canal

కాకతీయ కెనాల్ లో కారు , అందులో మూడు కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలు ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఈ మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యేకు చెల్లెలు, బావ కావటంతో ఇది ప్రమాదమా ? లేకా మర్డర్ నా అన్న అనుమానాలు నెలకొన్నాయి.  తిమ్మాపూర్ మండలం యాదవులపల్లి దగ్గర కాకతీయ కాలువలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. కారులో కుళ్లిన స్థితిలో వారి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతులు లక్ష్మీపూర్‌కు చెందిన సత్యనారాయణ రెడ్డి, రాధ, వినయశ్రీలుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. దంపతులిద్దరు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి చెల్లెలు, బావగా పేర్కొన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం వీరు అదృశ్యమయ్యారు. ఈ క్రమంలో గత నెల 27న కరీంనగర్‌లో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. ఇక ఆదివారం ఇదే ప్రదేశంలో మరో ప్రమాదం జరిగింది. ఓ రోడ్డు ప్రమాదంలో దంపతులను వెలికి తీసేందుకు పోలీసులు చర్యలు చేపడుతుండగా.. ఈ కారు ఆచూకీ లభ్యమైంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బంధువులది ప్రమాదమా..? లేక హత్యనా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును చేపడుతున్నారు.

మరోవైపు కారు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ కమలాసన్‌ రెడ్డి.. ఈ రోజు ఉదయం 7గం.లకు కారును గుర్తించినట్లు తెలిపారు. జనవరి 27న ప్రమాదం జరిగినట్లు నిర్ధారణకు వచ్చామని.. ఏడాది క్రితం సత్యనారాయణ రెడ్డి కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారని కమలాసన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కారుపై పలు చలాన్లు కూడా ఉన్నట్లు తాము గుర్తించామని ఆయన అన్నారు. అయితే కారు ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.ఇక ఈ ఘటనపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కూడా స్పందించారు. తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని ఆయన అన్నారు. సత్యనారాయణ రెడ్డి కుటుంబం తరచూ విహార యాత్రకు వెళ్తారని అలానే వెళ్లారని అనుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే సత్యనారాయణ కుటుంబానికి ఎలాంటి విబేధాలు కూడా లేవని వారి మిత్రులు పేర్కొన్నారు. ఏది ఏమైనా ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Peddapalli MLA’s Kin Found Dead In In Kakatiya Canal,peddapalli mla, manohar reddy,sister family , kakatiya canal

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article