పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం లోక్‌సభ, రాజ్యసభ ప్రారంభం కాగానే అదానీ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. యూపీలోని సంభల్‌లో చెలరేగిన హింస, అదానీ అవినీతి తదితర అంశాలపై చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలిగింది. లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ సముదాయించిన విపక్ష ఎంపీలు వినలేదు. అదానీ అంశంపై ఎన్డీయే ప్రభుత్వం ఎందుకు చర్చకు ఎందుకు భయపడుతోందని ఎంపీలు ప్రశ్నించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో లోక్‌సభను మధ్యాహ్నం 12 వరకూ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఇక సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా నిరసనలు కొనసాగాయి. దీంతో సభను రేపటికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ప్రకటించారు.