కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు

ఈరోజు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా పది లక్షల పింఛన్లు ఇవ్వబోతున్నామన్నారు. ప్రస్తుతం 36 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మొత్తం పింఛన్‌దారుల సంఖ్య 46 లక్షలకు చేరుకుంటుందని చెప్పారు. 57 సంవత్సరాలున్న వారికి పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా డయాలసిస్‌ పేషెంట్లకు సైతం పింఛన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. డయాలసిస్‌ పేషెంట్లకు రూ. 2016 పింఛన్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article