డబుల్ బెడ్రూం ఇళ్ళపై ప్రజలు సీరియస్

People Serious On Double Bedroom Delay

అంతా అనుకున్న‌ట్లే జ‌రిగింది. డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ఆల‌స్యం వ‌ల్ల ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న పెరిగింది. ఏకంగా జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యం వ‌ద్ద ధ‌ర్నా చేయాల్సి వ‌చ్చింది. ఇంత‌కీ ధ‌ర్నాకు దిగింది ఎవ‌రో తెలుసా? భోజ‌గుట్ట వాసులు. కొంత‌మంది అయితే ఏకంగా జీహెచ్ఎంసీ కార్యాల‌యంలోనికి చొచ్చుకు వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించారు. మ‌రికొంద‌రు మ‌హిళ‌లు రోడ్డుపై బైఠాయించారు. దీంతో, అక్క‌డ పెద్ద ఎత్తున ఉద్రిక‌త్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం త్వ‌రగా పూర్తి చేయాల‌ని నానా ర‌భ‌సా చేశారు. ​డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని సంవత్సరం క్రితం తాము ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణం చేయ‌లేద‌ని వాపోతున్నారు. దీంతో, ఏడాది నుంచి బ‌య‌ట అద్దెలు క‌ట్ట‌లేక తెగ ఇబ్బంది ప‌డుతున్నామ‌ని చెప్పారు. మొత్తానికి, ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డి నెల‌రోజులు కూడా కాలేదు.. అప్పుడే ప్ర‌జ‌ల్లో త‌మ అసంతృప్తిని వెళ్ల‌గ‌క్క‌డం ఆరంభించారు. ఈ ప‌రిణామం ఇంకా ఎటువంటి ప‌రిస్థితులకు దారితీస్తుందో?

telangana 2bhk delay

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article