Tuesday, April 22, 2025

వరద బాధితులకు ఆహార పంపిణీ మరియు సహాయం చేస్తూ అండగా ఉన్న, ఎమ్మార్పీఎస్ బృందం

పేరెల్లి ఎలీషా మాదిగ ( MRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

మహా జననేత మంద కృష్ణ మాదిగ గారి నాయకత్వం, MRPS ఆధ్వర్యంలో వరద బాధితులకు అండగా నిలిచే విధంగా ఆహార పంపిణీ మరియు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా పేరెల్లి ఎలిషా మాదిగ మరియు ఎంఆర్పిఎస్ బృందం. కృష్ణలంక కరకట్ట ప్రాంత ప్రజలు గత రెండు రోజులుగా వారి గృహాలు నీట మునిగి ఉండటం వల్ల పలు ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక యువకులతో సహాయక కార్యక్రమాలు మరియు ఆహారం పంపిణీ చేస్తూ అండగా నిలిచారు. గత ప్రభుత్వ హయాంలో 125 కోట్ల వ్యయంతో 2వ ఫేజ్ రిటైనింగ్ వాల్ నిర్మించింది.

 

ఆ నిర్మాణంలో లోపాల వల్ల చిన్న వరద వచ్చిన కరకట్ట క్రింద ఉన్న గృహాలు ముంపుకి గురవుతున్నాయి. ప్రభుత్వం త్వరిత దశన స్పందించి వాల్ మరమ్మతు పనులు చేపట్టి ముంపుకు గురవుతున్న కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ముంపుకు గురైన మరియు పూర్తిగా కూలిపోయిన ఇళ్లను గుర్తించి వారికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం వారికి నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. బుడమేరు ముంపుతో సముద్రాన్ని తలపిస్తున్న సింగ్ నగర్ మరి కొన్ని ప్రాంతాలకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అందించాలని కోరుతున్నాము.

మొగల్రాజపురం లో కొండ చరియలు విరిగిపడి మరియు పలుచోట్ల వరదలలో చిక్కుకొని మృతి చెందిన వారికి, వారి కుటుంబ సభ్యులకు మందకృష్ణ మాదిగ గారి తరపున ఎమ్మార్పీఎస్ నాయకత్వం ప్రగాఢ సంతాపం తెలుపుతుంది. మొగల్రాజపురం లో కొండ చరియలు విరిగిపడి మృతి చెందిన వారికి 5 లక్షల పరిహారం ఇవ్వడం సరికాదు. మృతి చెందిన ఒక్కొక్కరికి 25 లక్షలు మరియు గాయపడిన వారికి 5 లక్షలు చొప్పున పరిహారం అందించాలి. గుడ్లవల్లేరు బాలికల హాస్టల్ వాష్ రూమ్ లో హిడెన్ కెమెరాలా వివాదంపై సమగ్ర విచారం జరిపించి ఆ చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని సమాజంలో మహిళలకు భద్రత కల్పించే విధంగా ప్రభుత్వమే వారికి ధైర్యాన్ని చేకూర్చాలని MRPS ఆంధ్రప్రదేశ్ తరఫున కోరుతున్నాము.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com