ఎనిమిదో రోజు పెరిగిన  పెట్రోల్, డీజిల్ ధరలు

126
Petrol and diesel prices increases on the eighth day
Petrol and diesel prices increases on the eighth day

Petrol and diesel prices increases on the eighth day

పెట్రోల్ , డీజిల్ ధరలు మండుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఎనిమిదో రోజూ భారీగా పెరిగాయి. క్రమంగా  పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరలు ఏడాది గరిష్టానికి చేరుకున్నాయి. ఇక డీజిల్ కూడా ఏడు నెలల గరిష్ట స్థాయిని అందుకుంది. ఈ ఎనిమిది రోజుల్లోనే పెట్రోల్ 2 రూపాయలు, డీజిల్ 1.63 రూపాయలూ పెరగడం షాక్ ఇస్తోంది. ఇక సోమవారం తో పోలిస్తే మంగళవారం పెట్రోల్ 23 పైసలు, డీజిల్ 15 పైసలు పెరిగాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 78.80 రూపాయలకు చేరింది. డీజిల్ 73.11 రూపాయలైంది. ఇక అమరావతిలో పెట్రోల్ ధర 23 పైసలు పెరిగి 78.47 రూపాయలు గానూ, డీజిల్ ధర 14 పైసలు పెరిగి 72.44 రూపాయలకు చేరింది. విజయవాడలోనూ పెట్రోల్ ధర 23 పైసలు పెరిగి రూ.78.10, డీజిల్ ధర 15 పైసలు పెరిగి 72.10 రూపాయలకు చేరుకుంది.దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ పెట్రోల్ ధరలు పెరిగాయి. ముంబాయిలో పెట్రోల్ ధర 22 పైసలూ, డీజిల్ 15 పైసల మేర పెరిగాయి. దీంతో ముంబయిలో పెట్రోల్ ధర 79.72రూపాయలు, డీజిల్ 70.37 రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ ధర 22 పైసలూ, డీజిల్ 14 పైసల మేర పెరగడంతో పెట్రోల్ ధర 74.13 రూపాయలుగానూ, డీజిల్ ధర 67.07 రూపాయలుగానూ ఉంది.

tags : petrol. diesel, india, rates hike , hyderabad , amaravati, vijayawada

హుజూర్ నగర్.. బీజేపీ కోర్‌ కమిటీ మీటింగ్ 

కుక్క తోక నూపుతదా వ్యాఖ్యపై ఉద్యోగులు సీరియస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here