పెట్రోల్ కోసం ఆశపడి.

Petrol Disaster. ప్రాణాలు పోగొట్టుకున్నారు

  • మెక్సికోలో ఘోర అగ్నిప్రమాదం.. 67 మంది దుర్మరణం

పెట్రోల్ కోసం ఆశపడటం వారి ప్రాణాలకే చేటు తెచ్చింది. లీక్ అవుతున్న పెట్రోల్ పట్టుకుందామని వెళ్లినవారు ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో కాలిపోయారు. ఈ విషాదకర సంఘటన దక్షిణ అమెరికాలోని మెక్సికోలో చోటుచేసుకుంది. హిడాల్గో రాష్ట్రంలోని త్లాహులిల్‌పాన్‌ పట్టణంలో శుక్రవారం రాత్రి ఓ ఆయిల్‌ పైప్‌లైన్‌కు అక్రమంగా అమర్చిన ట్యాప్‌ లీక్‌ కావడంతో పెట్రోల్‌ను పట్టుకునేందుకు స్థానికులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. క్యాన్లు, బకెట్లతో అక్కడికి వెళ్లి పెట్రోలును నింపుకోవడం మొదలు పెట్టారు. ఇంతలో ఉన్నట్టుండి భారీ విస్పోటం సంభవించింది. పెట్రోలు కావడంతో క్షణాల్లో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. కన్ను మూసి తెరిచేలోపు పెద్ద పెద్ద మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 67 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 76 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. ప్రభుత్వరంగ ఆయిల్‌ సంస్థ పెమెక్స్‌ పైప్‌లైన్ల నుంచి మాఫియా, డ్రగ్‌ డీలర్లు ఇంధనాన్ని దొంగలించడం మెక్సికోలో సర్వసాధారణం. ఈ క్రమంలో అలా అక్రమంగా పెట్రోల్ దొంగిలించడానికి ఏర్పాటు చేసుకున్న అక్రమ పైప్ లైన్ ఇంతమంది ప్రాణాలను బలి తీసుకుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article