షాక్ లో రజినీకాంత్ `పేట‌`కు

Big shock  for  Rajani Kanth Petta
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, కార్తీక్ సుబ్బ‌రాజ్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `పేట్ట‌`. ఈ చిత్రం  2గంట‌ల 52 నిమిషాల నిడివితో ఉండ‌టం వ‌ల్ల సెకండాఫ్ సాగ‌దీత‌గా ఉన్న‌ట్లు అంద‌రూ అభిప్రాయ ప‌డుతూ సోష‌ల్ మీడియాలో విష‌యాన్ని పోస్ట్ చేశారు. దీన్ని సీరియ‌స్‌గా తీసుకున్న యూనిట్ సినిమాలో 20 నిమిషాలు ఎడిట్ చేసి సినిమాను ట్రిమ్ చేశార‌ట‌. ఇప్పుడు సినిమా నిడివి 2 గంట‌ల 32 నిమిషాలుగా మారింది.  చాలా రోజులుగా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తోన్న ర‌జ‌నీకాంత్‌కు పేట రూపంలో మంచి స‌క్సెస్ ద‌క్కింద‌ని ఆయ‌న అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా న‌వాజుద్దీన్ సిద్దికీ, విజ‌య్ సేతుప‌తి, త్రిష‌, సిమ్రాన్‌, మేఘా ఆకాష్‌, బాబీ సింహ త‌దిత‌రులు న‌టించారు. సంక్రాంతి సంద‌ర్భంగా ఈ సినిమా జ‌న‌వ‌రి 10న విడుద‌లైంది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article