40 రోజుల పాటు ఎస్ఐ అభ్యర్థుల దేహ దారుడ్య పరీక్షలు

SI Physical Examination Tests for 40 days 

రాత పరీక్షలో క్వాలిఫై అయ్యి దేహదారుఢ్య పరీక్షలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియలో రెండో దశ స్టార్ట్ కానుంది. జనవరి 31వ తేదీ గురువారం పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు షెడ్యూల్ జారీ చేసింది. ఫిబ్రవరి 11వ తేదీ నుండి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 40 రోజుల పాటు నిర్విరామంగా టెస్టులు జరుగనున్నాయి. ఎస్ఐ ప్రిలిమనరీ ఎగ్జామ్ జరిగిన సమయంలో ప్రశ్నాపత్రంలోని ఆరు ప్రశ్నలపై కోర్టులో కేసు ఫైల్ అయ్యింది. నాలుగు రోజుల క్రితం క్రితం ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దేహదారుఢ్య పరీక్ష 40 రోజుల పాటు ఉంటుందని…హైదరాబాద్‌లోని మూడు గ్రౌండ్లు సిద్ధం చేసినట్లు బోర్డు పేర్కొంది.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లా కేంద్రాల్లోని హెడ్ క్వార్టర్స్ గ్రౌండులో పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో డౌన్‌లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డులు చెల్లవని..మళ్లీ కొత్తగా డౌన్ లోడ్ చేసుకోవాలని బోర్డు అధికారులు సూచించారు. ఫిబ్రవరి 5 నుండి 9వ తేదీ అర్ధరాత్రి వరకు అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article