కొవిడ్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ‘ఫిజియోథెర‌పీ’

  • ప్ర‌పంచ ఫిజియోథెర‌పీ డే సంద‌ర్భంగా
  • అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రిలో కార్య‌క్ర‌మం

హైద‌రాబాద్, సెప్టెంబ‌ర్ 8, 2021: ఏదైనా గాయం నుంచి కోలుకోడానికి, నొప్పి త‌గ్గ‌డానికి, భ‌విష్య‌త్తులో గాయాలు కాకుండా నిరోధానికి లేదా దీర్ఘ‌కాల వ్యాధి ఉప‌శ‌మ‌నానికి ఫిజియోథెర‌పీ లేదా ఫిజిక‌ల్ థెర‌పీ ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే, కొవిడ్‌-19 అనంత‌ర ప్ర‌భావాలు, లేదా దానివ‌ల్ల క‌లిగే మాన‌సిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకూ ఇది సాయ‌ప‌డుతుంద‌ని తాజాగా తేలింది. ఆగ్నేయ హైద‌రాబాద్‌లోని ప్ర‌ధాన ఆసుప‌త్రులలో ఒక‌టైన అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రి (ఎల్బీ న‌గ‌ర్) బుధ‌వారం ప్ర‌పంచ ఫిజిక‌ల్ థెర‌పీ డే 2021 సంద‌ర్భంగా ఒక అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించింది.

ఫిజియోథెర‌పీ ప్రాధాన్యంపై అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రి ఫిజియోథెర‌పీ విభాగాధిప‌తి డాక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, “రోగుల‌కు వ్యాధి నిర్ధార‌ణ ద‌గ్గ‌ర నుంచి కోలుకోవ‌డం, నివార‌ణ‌.. ఇలా అన్ని ద‌శ‌ల్లోనూ ఫిజియోథెర‌పిస్టు వారిని సంర‌క్షిస్తుంటాడు. గాయ‌మైనా, లేదా దీర్ఘ‌కాలంగా నొప్పి ఉన్నా దానికి సంబంధించిన అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఫిజిక‌ల్ థెర‌పీ ఉప‌యోగ‌ప‌డుతుంది. అది నొప్పి నివార‌ణ మాత్ర‌మే కాదు, ప్ర‌స్తుత స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డానికి కావ‌ల్సిన చ‌ర్య‌లూ చేప‌డుతుంది. కొవిడ్-19 బారిన‌ప‌డిన‌వారు మ‌ళ్లీ త‌మ శారీర‌క సామ‌ర్థ్యం తిరిగి పొంద‌డానికి, ఆ ఇన్ఫెక్ష‌న్ వ‌ల్ల త‌లెత్తే మాన‌సిక స‌మ‌స్య‌ల నుంచి బయ‌ట‌ప‌డ‌టంతోనూ కీల‌క‌పాత్ర పోషిస్తుంది” అన్నారు.

“ఏదైనా వ్యాధి అయితే సంబంధిత వైద్య‌, ఆరోగ్య విభాగం వాళ్లు వెంటనే న‌యం చేస్తారు. కానీ, పోయిన సామ‌ర్థ్యాన్ని తిరిగి పొంద‌డం, పూర్వ‌వైభవం సాధించ‌డం ఫిజియోథెర‌పీ ద్వారానే సాధ్యం. మా ఆసుప‌త్రిలో రోగుల‌కు పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొంద‌డం యొక్క ప్రాధాన్యంపై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నాం. వాళ్ల‌కు సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు మా ఫిజిక‌ల్ థెర‌పీ బృందం ఇంట్లోనే పాటిస్తూ, కోలుకునేందుకు చేయాల్సినవేంటో చెబుతోంది. కొవిడ్‌-19 ఇన్ఫెక్ష‌న్ వ‌ల్ల ఎదుర‌య్యే శారీర‌క‌, మాన‌సిక స‌వాళ్ల‌ను అధిగ‌మించ‌డంలోనూ రోగుల‌కు మా ఫిజియోథెర‌పీ బృందం సేవ‌లు అందుబాటులో ఉంటాయి” అని అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రి సీఓఓ డాక్ట‌ర్ స‌త్వీంద‌ర్ సింగ్ స‌భ‌ర్వాల్ తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article