సల్మాన్ ఖాన్‌కు సోమవారం మరోసారి ఆగంతకుల నుంచి తీవ్ర బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. “సల్మాన్… నిన్ను ఇంట్లోనే చంపుతాం, లేదంటే నీ కారుని బాంబు పెట్టి పేల్చేస్తాం” అని ముంబయిలోని వర్లీ రవాణా శాఖ వాట్సాప్ నంబర్‌కు ఓ సందేశం వచ్చింది.
దాంతో వర్లీ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు, బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆ మేసేజ్ పంపిన వ్యక్తిని పోలీసులు తాజాగా గుర్తించారు. గుజరాత్ రాష్ట్రం వడోదరకు చెందిన 26 ఏళ్ల వ్యక్తే సల్లూ భాయ్‌ను బెదిరిస్తూ సందేశం పంపినట్లు చెప్పారు. అయితే, అతడు మానసిక రోగి అని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇది ఎంత వరకు నిజమో అర్ధం కావడంలేదు. మానసిక రోగి అన్న విషయం నిజమే అయితే అతను సల్మాన్ ఫోన్‌కే ఎలా మెసేజ్ చేస్తాడు. ఆయనను చంపుతాను అనే బెదిరింపులు ఎందుకు వస్తాయి. అసలు.. సల్మాన్‌కి అతనికి సంబంధం ఏమిటి అనే వార్తలు ఎన్నో సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఇక్కడ పోలీసులు ఆబద్ధమాడతున్నారా… లేక మరేదైనా విషయాన్ని దాస్తున్నారా అని ఎవరికి అర్ధం కావడం లేదు.