విమానంలో కలకలం

PLANE PASSENGERS SUFFERED

  • క్యాబిన్లో పీడన సమస్యతో పలువురికి అస్వస్థత
  • ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానంలో ఘటన

విమాన క్యాబిన్లో తలెత్తిన పీడన సమస్య వల్ల పలువురు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే నలుగురు ప్రయాణికుల ముక్కు నుంచి రక్తం కారడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. కొంతమంది చెవి నొప్పితో విలవిలలాడారు. దీంతో వెంటనే విమానాన్ని వెనక్కి తీసుకొచ్చి, బాధిత ప్రయాణికులకు చికిత్స చేశారు. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం 185 ప్రయాణికులు, సిబ్బందితో మస్కట్ నుంచి కాలికట్ బయలుదేరింది. అయితే, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రయాణికుల్లో కలకలం మొదలైంది. నలుగురు ప్రయాణికులకు ముక్కులో నుంచి రక్తం కారింది. కొంతమంది చెవినొప్పితో ఇబ్బంది పడ్డారు. వెంటనే ప్రమాదాన్ని గుర్తించిన పైలట్లు.. గ్రౌండ్ కంట్రోల్ కు సమాచారం అందించారు. అనంతరం వారి సూచనల మేరకు విమానాన్ని వెనక్కి తీసుకెళ్లి మస్కట్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. అక్కడ వైద్య సిబ్బంది బాధిత ప్రయాణికులకు చికిత్స చేశారు. వారు కోలుకున్న అనంతరం విమానాన్ని కాలికట్ పంపించారు. క్యాబిన్ లో పీడనం తగ్గడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article