కరోనా కంపు.. ఫ్లాట్ ఫారం రేటు పెంపు

దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న తాజా నిర్ణయం తెలుసుకుంటే ఎవరైనా నవ్వుతారు. కరోనా రద్దీని తగ్గించేందుకు ఫ్లాట్ ఫారం రేటు పెంచుతారా? గతంలో ఒక రాజు గడ్డం పెంచితే ట్యాక్స్ వేసినట్లుగా ఉందీ నిర్ణయమంటూ ప్రజలు ఒకటే ఇకఇకలు.. పకపకలు..

68
platform rates hike
platform rates hike

కరోనా తీవ్రత వల్ల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏకంగా ఫ్లాట్ ఫారం టికెట్లన పెంచేసింది. వినడానికే ఇది వింతగా ఉంది కదూ? పోనీ రేటేమైనా ఎక్కువగా పెంచేశారా? అంటే అదీ లేదు. ఓ ఇరవై రూపాయల్ని మాత్రమే పెంచారు. ఈ మొత్తం పెంచినందుకు ప్రయాణీకులు ఫ్లాట్ ఫారం మీదికి రాకుండా ఉంటారా? రద్దీని నియంత్రించేందుకు ఏదైనా ఇతర ప్రత్యామ్నయాల గురించి ఆలోచించాలి. అంతేతప్ప, ఇలా ఫ్లాట్ ఫారం టికెట్లు పెంచడమేమిటో? అని సామాన్య ప్రజానీకం అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైగా, పెంచిన ధరల్ని రేపట్నుంచి అమల్లోకి తెస్తున్నారట. కరోనా వల్ల దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఆలోచనా శక్తి లేకుండా పోయిందా అని ప్రజలు అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here