గుంటుపల్లిలో ప్లీనరీ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్

  • గుంటుపల్లిలో ప్లీనరీ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్

*ఎటువంటి లోటు లేకుండా చూడాలని నిర్వాహక కమిటీలకు దిశానిర్దేశం

మైలవరం:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లాస్థాయి ప్లీనరీ ఏర్పాట్లను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గురువారం పరిశీలించారు. రేపు అనగా జూలై 1న శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి గుంటుపల్లిలోని సి.ఏ కన్వెన్షన్ హాల్లో ప్లీనరీని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ గురువారం ఉదయం సి.ఏ కన్వెన్షన్ హాల్లో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్లీనరీకి హాజరయ్యే అతిథులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, అభిమానులకు, పార్టీ శ్రేణులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా ఏర్పాట్లను పూర్తి చేయాలని నిర్వాహక కమిటీలకు దిశానిర్దేశం చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article