PM MODI BIOPIC
ప్రస్తుత మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌కు రంగం సిద్ధమైంది. ఈ బయోపిక్‌లో టైటిల్ పాత్ర ధారిగా వివేక్ ఒబెరాయ్ నటించనున్నారు. ఈయన రక్తచరిత్రం, వినయవిధేయరామ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఈ నటుడు మోది బయోపిక్‌లో నటిస్తుండగా, ఈయన తండ్రి సురేష్ ఒబెరాయ్ నిర్మాతల్లో ఒకరుగా వ్యవహరిస్తున్నారు. `పిఎం నరేంద్రమోది` పేరుతో తెరకెక్కనున్న ఈ బయోపిక్ ఫస్ట్ లుక్ నేడు విడుదలైంది. ఈ లుక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సందీప్ ఎస్.సింగ్ మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బి.ఓమంగ్‌కుమార్ చిత్ర దర్శకుడు. `దేశభక్తే నా శక్తి` ఈ సినిమా ట్యాగ్ లైన్.