పీలో ప్రధాని మోడీ పర్యటన

PM Modi Travelling In AP.. ప్రజాచైతన్య సభ

భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోపర్యటించనున్నారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ గన్నవరం విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలుకుతారు. తూర్పు గోదావరి, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు గుంటూరు నుంచే రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ప్రారంభోత్సవం చేసి శంకుస్థాపన చేస్తారు. ప్రధాని హోదాలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. అనంతరం బహిరంగసభలో గుంటూరు నగర శివారులోని బుడంపాడు జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన భహిరంగసభలో పాల్గొంటారు. ఈ సభకు ‘ప్రజా చైతన్య సభ– సత్యమేవ జయతే’అని నామకరణం చేశారు. ఈ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎస్పీజీ ఐజీ ఆలోక్‌ వర్మ, గుంటూరు రేంజ్‌ ఐజీ కేవీవీ గోపాలరావు, గుంటూరు అర్బన్, కృష్ణా, ప్రకాశం ఎస్పీలు, విజయవాడ డీసీపీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రానున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏపీలో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఇక ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందని రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఒక భావన ఉన్న నేపథ్యంలో నేడు జరుగనున్న సత్యమేవ జయతే ప్రజా చైతన్య సభ లో ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ఏపీ కి సంబంధించిన ఏయే విషయాలు వెల్లడిస్తారు అనేది ప్రస్తుతం ఏపీ లో ఆసక్తికర అంశంగా ఉంది.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article