Thursday, February 13, 2025

పోచంపల్లి ఫాంహౌస్‌లో కోడి పందాలు నోటీసులు జారీ చేసిన పోలీసులు

బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రధాన అనుచరుడు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫాంహౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తేలింది. మొయినాబాద్‌ శివారులోని ఆయన ఫాంహౌస్‌లో క్యాసినో, కోడి పందాలు, పార్టీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో ఏకంగా 64 మంది పాల్గొనగా.. ఇందులో ప్రముఖులు ఉన్నట్లు తేలింది. దీంతో పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డికి మొయినాబాద్‌ పోలీసులు గురువారం రోజున నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఆయన ఫామ్ హౌస్‌లో భారీ ఎత్తున కోడి పందేల నిర్వహించడంపై కేసు నమోదైంది.

విచారణకు రావాలి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ కి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు మొయినాబాద్‌ పోలీసులు గురువారం రోజున నోటీసులు జారీ చేశారు. మొయినాబాద్‌ మండల పరిధిలోని తొల్కట్టలోని పోచంపల్లి శ్రీనివాస్ ఫామ్ హౌస్‌లో భారీ ఎత్తున కోడి పందేల నిర్వహించడం కలకలం రేపింది. పదకొండు ఎకరాలున్న ఫామ్ హౌస్ లో కోడిపందేలతో పాటుగా పేకాట, కేసినో నిర్వహిస్తున్నారనే సమాచారం రంగంలోకి దిగిన పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ మేరకు మొత్తం 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.30 లక్షల నగదుతో పాటుగా 55 లగ్జరీ కార్లను సైతం సీజ్ చేశారు. 11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫామ్‌హౌస్‌లో వ్యాపారి భూపతిరాజు శివకుమార్‌ వర్మ క్యాసినో, కోడిపందేలు నిర్వహించారు. పోలీసుల అదుపులో A1గా భూపతిరాజు శివకుమార్‌ వర్మ ఉన్నారు. అయితే త-న ఫామ్‌హౌస్‌ను లీజ్ కు ఇచ్చినట్లుగాఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ పోలీసులకు వెల్లడించారు. కానీ ఎమ్మెల్సీ చెప్పింది అవాస్తవమని పోలీసులు తేల్చారు. ఫామ్‌హౌస్‌లో రెండేళ్లుగా కోడిపందేలు, క్యాసినో నిర్వహణ జరుగుతోందని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com