పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండర్ల నోటిఫికేషన్

POLAVARAM REVERSE TENDER NOTIFICATION

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జగన్ సర్కార్ ముందడుగు వేసింది. రివర్స్ టెండరింగ్ వల్ల నష్టమని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈఓ సూచనను కూడ లెక్క చేయలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు రివర్స్ టెండర్లను ఏపీ ప్రభుత్వం శనివారం నాడు పిలిచింది.పోలవరం హెడ్ వర్క్స్, జలవిద్యుత్ కేంద్రాల్లో పనులకు ఏపీ ప్రభుత్వం టెండర్లను పిలిచింది. రూ. 4,900 కోట్లతో ఈ పనులను చేపట్టనున్నారు. హెడ్ వర్క్స్‌కు రూ. 1800 కోట్లు, జల విద్యుత్ పనులకు 3100 కోట్లకు టెండర్లను పిలిచారు.

శుక్రవారం నాడు ఏపీ రాష్ట్ర నీటి పారుదల శాఖాధికారి ఆదిత్యనాథ్ దాస్ కు పీపీఏ సీఈఓ ఆర్ కే జైన్ లేఖ రాశారు.ఈ నెల 13వ తేదీన హైద్రాబాద్ లో సమావేశమైన పోలవరం ప్రాజెక్టు అథారిటీ రివర్స్ టెండరింగ్ నష్టాన్ని చేకూరుస్తుందని చెప్పిందని , ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలంటే రివర్స్ టెండరింగ్ వద్దని పీపీఏ సూచించింది.ఇక అలాగే ప్రాజెక్టు విస్తృత ప్రయోజనాల మేరకు రీ టెండరింగ్ విధానాన్ని మానుకోవాలని సలహా ఇస్తున్నట్టుగా ఆ లేఖలో పీపీఏ సీఈఓ కోరారు. కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే వరకైనా రివర్స్ టెండరింగ్ విధానాన్ని నిలిపివెయ్యాలని ఆయన లేఖలో కోరారు. రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన లేఖలో అభిప్రాయపడ్డారు. మరి ఈ రోజు రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చెయ్యాలని నిర్ణయం తీసుకున్న అధికారులు పీపీఏ సిఈ ఓ జైన్ లేఖ రాసినా బేఖాతరు చేశారు. ఈ రోజు రీ టెండరింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Telangana in deep Financial CRISIS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *