పందులు ,జంతువుల కళేబరాలతో నూనె తయారీ

police arrest man for extracting oil from animal waste

కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టు తయారైంది పరిస్థితి. పాలు, నీళ్ళు . కూరగాయలు , పప్పులు ఇలా ఒకటేంటి ప్రతి ఒక్కటి కల్తీ చేస్తున్నారు కేటుగాళ్ళు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇక తాజాగా  జంతువుల కళేబరాలతో నూనె తయారు చేస్తున్న ముఠా పట్టుబడటం షాక్ కు గురి చేసింది. ఇక వారు చేస్తున్న పని ఏంటో తెలిస్తే మాత్రం మన ఇంత దారుణమైన కల్తీ వస్తువులను వినియోగిస్తున్నామా అన్న అనుమానం కలగకమానదు.

జంతువుల కళేబరాలతో నూనె తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు రంగారెడ్డి జిల్లా పోలీసులు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ పంచాయతీ, రైల్వే స్టేషన్ సమీపంలోని హరి ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పరిశ్రమలో కొందరు  జంతు కళేబరాలతో నూనె తయారు చేస్తున్నారు. చనిపోయిన పందులు వాటి కళేబరాలతో కల్తీ నూనె తయారు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు అత్యంత హానికరమైన ఈ కల్తీ నూనె యధేచ్చగా మార్కెట్ లో విక్రయిస్తున్నారు.
అమాయక ప్రజలు దీనిని కొనుగోలు చేసి అనారోగ్యం బారిన పడుతున్నారు. అయితే ఈ దందాపై  స్థానికులు  సమాచారం ఇవ్వటంతో రెవెన్యూ అధికారులు , పోలీసులు పరిశ్రమను తనిఖీ చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పరిశ్రమను సీజ్ చేశారు. అదుపులోకి తీసుకున్న వారిని విచారిస్తున్న పోలీసులు మొత్తం వ్యవహారాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article