కూల్ డ్రింక్ తో ఆటో డ్రైవర్: దిశా యాప్ తో జైలుకి

148
Police Arrested an auto driver With Disha App
Police Arrested an auto driver With Disha App

Police Arrested an auto driver With Disha App

ఏపీలో వైసీపీ ప్రభుత్వం  తీసుకొచ్చిన దిశ యాప్ క్షేత్రస్దాయిలో సత్ఫలితాలు ఇస్తోంది. నిన్నటికి నిన్న భర్త ఒక యువతిని వేధింపులకు గురి చేస్తున్నారని ఓ భార్య భర్త భరతం పడితే తాజాగా మరో ఘటన దిశా యాప్ ఎంతగా ఉపయోగపడుతుందో అర్ధం అయ్యేలా చెప్తుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో దిశ యాప్ వాడకం ద్వారా మహిళల భద్రతలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న  పోలీసులు తాజాగా కృష్ణా జిల్లా కైకలూరులో ఓ యువతి ఫోన్ కాల్ ఆధారంగా ఆమెకు కూల్ డ్రింక్ ఆఫర్ చేసిన ఆటో డ్రైవర్ ను అరెస్టు చేశారు.

ఏపీ ప్రభుత్వం మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన దిశ యాప్ మంచి ఫలితాలు అందిస్తోంది. దీన్ని ప్రభుత్వం కూడా విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో మహిళల్లో మంచి స్పందన వస్తోంది. తాజాగా కృష్ణాజిల్లా కైకలూరు సమీపంలోని కొల్లేటి కోట వద్ద ఓ యువతి ఆటో ఎక్కేందుకు ఎదురు చూస్తున్న ప్రయత్నంలో అక్కడికి వచ్చిన ఆటో డ్రైవర్ ముందుగా కూల్ డ్రింక్ ఆఫర్ చేశాడు. అందులో మత్తుమందు కలిపాడని అనుమానించిన ఆ యువతి దిశ యాప్ ఓపెన్ చేసి పోలీసులకు ఫిర్యాదు పంపింది. దీంతో వెంటనే స్పందించిన విజయవాడ కంట్రోల్ రూమ్ పోలీసులు కొల్లేటి కోట పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేవలం 8 నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను కాపాడారు.యువతికి కూల్ డ్రింక్ ఆఫర్ చేయగానే అందులో ఆటో డ్రైవర్ మత్తుమందు కలిపి ఉంటాడని ఆమె భయపడింది. వెంటనే దిశ యాప్ తెరిచి ఫిర్యాదు చేసింది. దిశ యాప్ లో ఎస్ఓఎస్ ఆప్షన్ ద్వారా సమాచారాన్ని అందుకున్న విజయవాడ కంట్రోల్ రూమ్ అధికారులు, వెంటనే కొల్లేటి కోట పోలీసులను అప్రమత్తం చేశారు.ఆమెకు కాల్ కూడా చేయకుండా స్మార్ట్ ఫోన్ లొకేషన్ సిగ్నల్స్ ఆధారంగా ఆటోను ట్రేస్ చేశారు. ఆటోను నడిపిస్తున్న పెద్దిరాజు అనే యువకుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలు ఊహించినట్టుగానే, కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపానని పెద్దిరాజు విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది.మొత్తానికి ఏపీలో దిశా యాప్ మాత్రం కేటుగాళ్ళ భరతం పడుతుంది.

Police Arrested an auto driver With Disha App,Kaikaluru , Vijayawada police, Krishna District, Amaravati, Disha App, AP Govt, AP Police, YSRCP govt, CM Jagan

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here