శివాజీ ఎలా దొరికాడో తెలుసా?

Police Arrested Shivaji and Seized His Passport

టీవీ9 వివాదంలో సినీనటుడు శివాజీని బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం సైబరాబాద్ సైబర్ క్రైం పీఎస్‌కు శివాజీని తరలించారు. టీవీ9లో షేర్లు కొన్నట్లు ఆయన బోగస్ పత్రాలు సృష్టించారంటూ అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.ఇదే కేసులో విచారణకు హాజరవ్వాల్సిందిగా టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌తో పాటు శివాజీకి పోలీసులు పలు మార్లు నోటీసులు జారీ చేశారు. అయితే వీరిద్దరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

కొద్దిరోజుల తర్వాత రవిప్రకాశ్ పోలీసుల ఎదుట హాజరైనప్పటికి శివాజీ మాత్రం స్పందించలేదు. తనపై నమోదు అయిన కేసులను కొట్టివేయాల్సందిగా అతను హైకోర్టును ఆశ్రయించాడు. అయితే న్యాయస్థానం అతని క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో శివాజీపై సైబర్‌క్రైమ్ పోలీసులు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం అమెరికాకు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌‌పోర్టుకు వచ్చిన శివాజీని ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారంతో అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు పారిపోతుండగా, సైబరాబాద్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయన పాస్ పోర్టును సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీచేశారు. జూలై 11న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అనంతరం వదిలిపెట్టారు. దీంతో తన కారులో శివాజీ ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో శివాజీని ఎయిర్ పోర్టులో గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందజేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article