బైక్ దొంగను అదుపులోకి తీసుకున్నమిర్యాలగూడ పోలీసులు

అంతర్ జిల్లా బైక్ దొంగను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడ పరిసర ప్రాంతాలలో పార్కింగ్ చేసిన బైకులను చోరీ చేస్తున్న మహబూబ్ నగర్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన దర్శనం వినోద్ అనే యువకుడు మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు జరుపుతున్న వాహనాల తనిఖీలో పట్టుబడ్డాడు. ఈ మేరకు విచారణ జరిపిన పోలీసులు నిందితుడి వద్దనుండి ఎనిమిది లక్షల రూపాయల విలువచేసే 16 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు మిర్యాలగూడ డి.ఎస్.పి వై. వెంకటేశ్వరరావు మీడియా సమావేశంలో వెల్లడించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article