విద్యుత్తు సిబ్బందిపై పోలీసు జులుం

24 గంటల విద్యుత్ సరఫరా చేసే విద్యుత్ శాఖ పై పోలీస్ శాఖ ఆంక్షల్ని విధిస్తోంది. డ్యూటీలకు వెళుతుంటే ఎక్కడికంటూ పలువురు విద్యుత్ సిబ్బందిపై పోలీసులు దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో
నల్గొండ జిల్లాలో విద్యుత్ సిబ్బంది పై దాడి చేశారు. ఇందుకు నిరసనగా నల్గొండ జిల్లా కేంద్రంలో సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. హైదరాబాద్లో విద్యుత్ అధికారులు, సిబ్బంది పై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. హాస్పిటల్, ఇండ్లకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసే మాపై ఇలా ఆంక్షలేమిటని వాపోతున్నారు. తాము విధులకు దూరంగా ఉంటే రాష్ట్రం అంధకారం అవుతుంది అంటూ విద్యుత్ సిబ్బంది హెచ్చరిస్తున్నారు. తమకు లాక్ డౌన్ నిబంధనల నుండి మినహాయింపు ఉన్నా.. ఇలా చేయడం కరెక్టు కాదంటూ విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు విజ్ఞప్తి
విద్యుత్ శాఖ ఉద్యోగులు, సిబ్బంది 24 గంటలు ,హాస్పిటల్, వినియోగదారుల కు నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు పని చేస్తున్నారు. కాబట్టి, పోలీస్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యుత్ శాఖ సిబ్బందిని, అధికారులను అపవద్దు. వాహనాలను సీజ్ చేయవద్దు. నల్గొండ, హైదరాబాద్లో విద్యుత్ శాఖ సిబ్బంది, అధికారులపై దాడి చేసినట్లు నా దృష్టికి వచ్చింది. మా డిపార్టుమెంట్ ఐడి కార్డ్, సంబంధిత పాస్ చూపిస్తే వదిలేయండి. మా శాఖ సిబ్బందికి, అధికారులకు లాక్ డౌన్ మినహాయింపు ఉంది. పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నా.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article