కరోనా వైరస్ పై పోస్ట్ లు పెడితే కేసులు…

Police Case On Fake News Spreading On Corona In AP

కరోనా వైరస్ పై ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళనలు  వ్యక్తం అవుతున్నాయి.  సోషల్ మీడియాలో కరోనా వైరస్ పై జరుగుతున్న వైరల్ ప్రచారం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా మారింది. సోషల్ మీడియాలో కరోనా వైరస్ పై ప్రచారం విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. కరోనా వైరస్ మన ప్రాంతంలో వచ్చిందంటూ కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో వదంతులు వ్యాపింపజేస్తున్నారు. దీంతో స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. ఏపీలో ఈ తరహా ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్న నేపధ్యంలో ఏపీ డీజీపీ ఈ వదంతులపై కన్నెర్ర చేశారు. ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే సహించమని చెప్పారు.

కరోనా వైరస్ కు సంబంధించి ఏపీలో ఒక కేసు కూడా నమోదు కాకున్నా కరోనా వైరస్ వచ్చిందని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈ  వదందులపై ఏపీ డీజేపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్ గా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.  వారిపై కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు . సామాజిక మాధ్యమాల్లో ఫేక్ పోస్టులను పెడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే వారిపై కేసులు నమోదు చేయాలని అన్ని జిల్లా పోలీసు అధికారులకు డీజీపీ ఆదేశాలిచ్చారు. ప్రజల్లో అపోహలు తొలగించటానికే  ప్రతి రోజూ రాష్ట్ర వైద్యాధికారులతో పాటు, రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనాపై ప్రత్యేక బులెటిన్ విడుదల చేస్తున్నారని  డీజీపీ తెలిపారు.  కరోనా వైరస్‌ గురించి సోషల్ మీడియాలో  చేస్తున్నవి తప్పుడు ప్రచారాలని, ప్రజలు ఎవరూ వాటిని నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కరోనా వైరస్‌పై లేనిపోని అపోహలను సృష్టిస్తే ఊరుకునేది లేదని  హెచ్చరికలు జారీ చేసిన డీజీపీ గౌతమ్ సవాంగ్  వదంతులు సృష్టించే వ్యక్తులను ఉపేక్షించేది లేదని చెప్పారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article